బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన వైనం
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ వేములకుర్తి గ్రామాల్లోని దేవాలయాల్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై నవీన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వేముల కుర్తి తిమ్మాపూర్ గ్రామాల్లో ఉన్న పెద్దమ్మ దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న మూడు మాసాల బంగారు పుస్తెలు, వెండి ముక్కు పుల్ల అదే గ్రామంలోని రామాలయం టెంపుల్ లో మూడు మాసాల బంగారం పుస్తెలు, తిమ్మాపురం గ్రామంలోని పెద్దమ్మ టెంపుల్ లో ఉండేది పగలగొట్టి కొంత నగదు డబ్బులను మరియు విగ్రహం యొక్క రెండు మాసాల ముక్కుపుళ్లను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్ళినట్లు వేముల గుర్తి గ్రామ దేవాలయ కమిటీ చైర్మన్ కోబాజీ లక్ష్మీ నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. కాగా సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించారు
