navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 5:43 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డా జి సుజాత

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం – జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ జి సుజాత సోమవారం మెట్ పల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంపల్సరీ అని, రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ మాత్రమే సేవలు అందించాలని ఎవరైనా వెళ్ళిపోయిన కానీ కొత్తగా చేరినచో డాక్టర్లను గాని స్టాఫ్ ను గాని ఆడ్ చేయించుకోవాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోసాధారణ, శస్త్ర చికిత్సల ప్రసవాలతో పాటు ఇతర వైద్య సేవలకు తీసుకునే ఫీజుల వివరాలతో ఆయా వైద్యశాలలలో బోర్డులనుఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరుపేదప్రజలు వైద్యం కోసం తమ ఆసుపత్రులకు వచ్చినప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథంతోవారికి తక్కువ డబ్బులతో చికిత్స అందజేయాలని, ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్టేజీ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, వైద్యశాలల పరిసరాలు పరిశుభ్రతతోఉండేందుకు తగు చర్యలుతీసుకోవాలన్నారు.ఈ కార్య క్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, డి పి ఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.