నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
కోరుట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం జరిగిన పలు శుభకార్యాల్లో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు గారు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్లో జరిగిన ఖానాపూర్ లక్ష్మి నరసయ్య గౌడ్ కుమారుడు శ్రీనాథ్ గౌడ్ – మధులిక వారి వివాహ మహోత్సవంలో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.అదే విధంగా నల్ల తిరుపతి రెడ్డి వాళ్ళ కుమార్తె వివాహం కోరుట్లలోని ముక్కాస్ ఫంక్షన్ హాల్ లో జరగగా అందులో డాక్టర్ రఘు పాల్గొన్నారు. తొగిటి లక్ష్మీ అంజయ్య గార్ల కుమారుడు వినయ్ గౌతం – హర్షితల వివాహం మెట్ పల్లి పట్టణంలోని వీఆర్ఎమ్ గార్డెన్ లో జరగగా ఆ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు అజార్ భాయ్, రేండ్ల రాజన్న, చెట్లపల్లి దేవేందర్ గౌడ్, మెడిచెల్మెల నాని, పసుల శివ కుమార్, సోమిడి ప్రశాంత్, దేశెట్టి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
