పారదర్శకమైన ఓటరు జాబితాల తయారీకి రాజకీయ పార్టీల సహకారం అవసరం
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి : పారదర్శకమైన, లోపరహిత ఓటరు జాబితాల తయారీ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) షెడ్యూల్‌పై సమావేశం నిర్వహించారు. 01.10.2026 అర్హత తేదీని ఆధారంగా చేసుకుని చేపట్టనున్న ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, షెడ్యూల్, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. జూన్ 15 నుంచి...