పారిశుధ్య కార్మికురాలికి పరామర్శ
మున్సిపల్ పాలకవర్గం, ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండ ! నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: ఇటీవల కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన స్థానిక మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు నేరేళ్ల స్వప్నను బుధవారం మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ మరియు ‘ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రతినిధులు కలిసి ఆమె నివాసంలో పరామర్శించారు. స్వప్న ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సహాయాన్ని వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించి,...