నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి:
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఆదివారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల 2002-2003 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా చిన్ననాటి స్నేహితులు ఒకే వేదికపై చేరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.ఈ స్నేహితులు గతంలో తమ తోటి స్నేహితుల కష్టసుఖాలను పంచుకొని అనారోగ్యానికి గురైనా, మృతి చెందిన స్నేహితుల కుటుంబాలను స్మరించుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు ఆర్థిక సాయం గా 2003 బ్యాచ్ పేరుతో రూపాయలు 18,500 విలువైన సౌండ్ సిస్టంను అందజేశారు పాఠశాల లో ప్రేయర్ కోసం ఉపయోగ పడుతుందని ఆలోచన హాజరైన పూర్వ ఉపాధ్యాయులు కొనియాడారు. అలాగే పలు సేవా కార్యాక్రమాలు కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముక్తకంఠంగా అందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా మిత్రులు అలనాడు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి అటాపాటలతో సందడి చేశారు. అనంతరం అప్పటి గురువులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పూర్వ గురువులు మాట్లాడుతూ.. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరం ఒకే చోట కలుసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రస్తుత పాఠశాల హెడ్మాస్టర్ దూస గోవర్ధన్, పూర్వ హెడ్మాస్టర్ డి శ్రీనివాస్, వెంకన్న, పావని, తిరుమల ,శారద ,భూపతి, కవిత శ్రీనివాస్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.