పెన్షన్ల నిలుపుదల నివారణకు లైవ్ సర్టిఫికెట్ తప్పనిసరి
25వ వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఈరోజు వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్, వార్డు ఆఫీసర్ మధులతతో కలిసి ఇంటింటికి తిరిగి మున్సిపల్ పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు లైవ్ సర్టిఫికెట్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-కేవైసీ ద్వారా వేలిముద్రలు, కంటి స్కానింగ్, ముఖం స్కానింగ్ నిర్వహించి లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.లైవ్ సర్టిఫికెట్ పూర్తి చేయని పక్షంలో పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని కౌన్సిలర్ అస్ర ఫర్హీన్...