పోషకాహార వంటల పోటీలు–గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు
నవగీతం,(కొడిమ్యాల ప్రతినిధి) కొడిమ్యాల మండలం తిప్పయపల్లి గ్రామంలో ఈ రోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా స్థానికంగా లభ్యమయ్యే పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించేందుకు వంటల పోటీలు నిర్వహించారు.జంక్ ఫుడ్‌కు “నో” చెప్పాలనే సందేశంతో ఆహార వైవిధ్యంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.అలాగే గర్భిణీ స్త్రీలకు ఏ.ఎన్.ఎం.లు లత, వనలక్ష్మి మరియు ఆశావర్కర్లు రక్త పరీక్షలు నిర్వహించారు. వంటల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ల్యాగల రాజేశం, గ్రామ సెక్రటరీ, గర్భిణీలు, తల్లులు, పిల్లలు, మహిళలు గ్రామ ప్రజలు,...