ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా పుస్తక ప్రదర్శన.
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు కార్యక్రమం గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మంచినీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, పిల్లల భద్రత, ఆరోగ్య రక్షణకు సంబంధించి చర్యలు చేపడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, గ్రంథాలయధికారి భీమ్ రాజ్, వార్డు సభ్యులు కాషవత్తుల గంగా రెడ్డి,మహమ్మద్...