navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 8:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రజాప్రభుత్వంలోనే పేదలకు లబ్ది

అర్హులైన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు

టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

నవగీతం,కొత్తగూడెం:

కొత్తగూడెం పరిధిలోని అర్హులైన ఆడబిడ్డలందరికి ఇందిరమ్మఇళ్లు ఇవ్వడం జరుగుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. బుధవారం లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని హమాలీ కాలనీ గ్రామంలో దేవి – గబ్బర్ సింగ్ దంపతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించిన డబ్బులతో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు , అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగించుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఇవ్వకుండా బిఆర్ఎస్ నేతలు మోసం చేశారన్నారు. మరికొన్ని రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్హులైన మరింత మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్,ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దయ్యాల సమ్మయ్య,కోంపెల్లి వీరయ్య,రావు కిరణ్,బోడా రమేష్ నాయక్,అక్బర్ యువజన కాంగ్రెస్ నాయకులు సాయిచంద్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.