నవగీతం,కోరుట్ల ప్రతినిధి:(వి.సంపత్)
కోరుట్ల నుండి ఒడ్యాడ్ వరకు ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసినట్లు స్థానికులు తెలిపారు.ఈ బస్సు సేవల ప్రారంభంతో విద్యార్థులు సమయానికి పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అవకాశం కలగనుంది. అలాగే రైతులు మరియు గ్రామీణ ప్రజలు తమ నిత్యావసర పనుల కోసం ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించగలరని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే చూపుతున్న సేవాభావం అభినందనీయమని గ్రామస్థులు కొనియాడారు. ప్రజల అవసరాలను గుర్తించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు కానుగంటి శ్రీనివాస్, బొమ్మెన ప్రశాంత్, ఉపసర్పంచ్ కంచి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు