ప్రజాహితానికి మరో అడుగు..కోరుట్ల – ఒడ్యాడ్ బస్సు సేవలు ప్రారంభం
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:(వి.సంపత్) కోరుట్ల నుండి ఒడ్యాడ్ వరకు ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసినట్లు స్థానికులు తెలిపారు.ఈ బస్సు సేవల ప్రారంభంతో...