navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:05 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రి అడ్లూరి

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి;

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యా విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించడానికి కృషిచేసిన మల్లాపూర్ మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి ని ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే మల్లాపూర్ మండలం నుండి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన జెడ్‌పీహెచ్‌ఎస్ మొగిలిపేట విద్యార్థినులు అనుష్క, అనువంశికలను అభినందిస్తూ సన్మానించారు.ఈ కార్యక్రమంలో జెడ్‌పీహెచ్‌ఎస్ మొగిలిపేట ప్రధానోపాధ్యాయులు కొమ్మడి లక్ష్మణ్, ఉపాధ్యాయులు తోట లింగన్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పలువురు విద్యాభిమానులు పాల్గొన్నారు.