ప్రాణంతో మన మధ్య లేకున్నా సుప్రియ చిరంజీవి.!
జీవన్మృతి అవయవదానంతో పలువురికి పునర్జీవం..! నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలలో వివాహిత అవయవ దానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు ప్రసరించి మానవత్వం చాటుకున్నది.వివరాల్లోకి వెళితే...మే 24న ఆదివారం జగిత్యాల పట్టణం హనుమాన్ వాడ కు చెందిన అక్కపెళ్లి ప్రవీణ్ సతీమణి సుప్రియ (25) అనే మహిళ స్కూటీ బండి నడిపించడం నేర్చుకునే క్రమంలో బండి పై నుండి ప్రమాదవశాత్తు పడి తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాదులోని యశోద...