ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య..
విద్య ద్వారానే సమాజ వికాసం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పాల్గొన్నారు.విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో...