ప్లాస్టిక్ సంచులు వినియోగంపై వార సంతలో అవగాహన
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం లో వారసంత లో కూరగాయలు అమ్మే వారికి గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు వాడకం తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని, ఈ ప్లాస్టిక్ సంచులు వాడకం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ, భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుంది,ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల పశువులు చనిపోతున్నాయి...