ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా చాప వందన నియామకం
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు కోరుట్ల కు చెందిన చాప వందనను ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నియమించినట్టు జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి రత్న పద్మావతి శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు నియామకం జరిగిందని అన్నారు.ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వందనను కోరుట్ల జడ్జి కాసుల పావని, కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అంజనేయులు, శ్రీనివాసరావు,సదాశివ రాజు,చాప...