బీసీ మహిళా నాయకురాలిపై వ్యాఖ్యలు మానుకోవాలి

కాంగ్రెస్ నేతలకు ఓరుగంటి చంద్రశేఖర్ హెచ్చరిక నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం అంశంపై మాట్లాడుతున్న ఒక బీసీ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.ఇటీవల కలెక్టరేట్‌లో ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన “ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ విజయోత్సవం” కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా నిర్వహించబడిందని ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో...