navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 8:15 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ భారీ విజయం

మల్లాపూర్ మండల కేంద్రంలో సంబరాలు

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంపై మల్లాపూర్ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.మల్లాపూర్ మండల బిజెపి అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భరతమాత కూడలి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని కొక్కు గంగాధర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి , మండల ఉపాధ్యక్షులు లవంగ శివ, మండల నాయకులు గడ్డం నర్సారెడ్డి, పట్టణ అధ్యక్షులు ముస్కెరి రాజ్ కుమార్, బూత్ అధ్యక్షులు గాండ్ల గంగరాజు, ఎర్ర రాజు, భూక్యా రాజశేఖర్, మొరపు గంగరాజాం, కోలా రాజేందర్, కోప్పేలా లక్ష్మారెడ్డి, అడగట్ల ప్రసాద్, ముస్కెరి సంతోష్, శాంతరాజం,, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు