భక్తి భావంతో సాగిన అన్నపూర్ణ అమావాస్య మహా అన్నప్రసాద వితరణ

కోరుట్లలో సుమారు 800 మంది భక్తులకు అన్నసంతర్పణ నవగీతం,కోరుట్ల ప్రతినిధి: సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి, సేవా భావం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా అత్యంత ఘనంగా జరిగింది. అమావాస్య అనే పవిత్ర దినాన పితృదేవతల తృప్తి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, భక్తులు విశేషంగా హాజరయ్యారు. సుమారు 800 మందికి పైగా భక్తులు పాల్గొని మహా...