navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 4:28 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి జయంతి పూజలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీశనీశ్వరుడి జయంతి సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు, పూజారులచే తైలాభిషేకాలు, అర్చనలు, హారతి తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీశనీశ్వరుడికి నల్ల వస్త్రం, నువ్వులు, కొబ్బరికాయలు,గంధం, పసుపు, కుంకుమ, అగర్‌బత్తులు, నీరుతో అభిషేకాలు నిర్వహించారు., ఆలాగే ఆంజనేయస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ..శ్రీ శనీశ్వరుడి జయంతి ఏటా వైశాఖ అమావాస్య తిథినాడు శశనీశ్వరుడి జయంతి నిర్వహించడంతో ఆయన అనుగ్రహం పొందితే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయని, శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు అంజన్న, పద్మశాలి సేవా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.