నవగీతం, వైరా ప్రతినిధి:
వైరా మండలం పుణ్యపురం గ్రామంలో కొలువైయున్న ఎన్నో సంవత్సరాలు గల చరిత్ర కలిగిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల త్రాగునీటి సౌకర్యార్థం స్థానిక గ్రామ రైతు ముందుకు వచ్చినటువంటి దాత బోల్ల వెంకటి, అంజలి దంపతులు దాతృత్వంతో భక్తుల సౌకర్యార్థం ముందుకు వచ్చి చెడిపోయిన బోరు మోటర్ స్థానంలో, నూతన బోరు మోటారును, నూతన పరికరాలను ఆలయ కమిటీ సభ్యులకు, అర్చకులకు అందజేసి సొంతంగా ఎలక్ట్రిషన్ పని విద్య తెలిసినా దాత గనుక బోరు మోటార్ ను బిగించి అందజేశారు భక్తుల నీటి ఇబ్బందులను తొలగించడానికి వారు చేస్తున్న ఈ నిస్వార్థ సేవను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు స్వామివారి కృపతో తాత కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలు బోల్ల వెంకటి దంపతులకు తీర్థప్రసాదాలను అందజేశారు.