టపాసులు పేల్చి స్వీట్స్ పంపిన చేసిన కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
అసెoబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా కోరుట్ల పట్టణం లోని కార్గిల్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, ఓబీసి మోర్చా ఉపాధ్యాక్షుడు రుద్ర శ్రీనివాస్, హాజరయ్యారు ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ దేశ ప్రజలు మరో సారి నరంద్ర మోడీ నాయకత్వనికి మద్దతు తెలుపుతూ బీజేపీ కి అపూర్వ విజయాన్ని అందించారాని అన్నారు అస్సాం, పుదుచ్చేరి లో తిరిగి విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమనీ అభివృద్ధి పారదర్శక పాలన పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిభిoభిస్తోందని తెలిపారు.అలాగే వెస్ట్ బెంగాల్ లో బీజేపీ మొదటిసారిగా అధికారం చేపట్టడం చరిత్రత్మక ఘట్టమని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా పార్టీ ప్రభావం రోజు రోజుకు విస్తరిస్తోందని ఇది ప్రజల మార్పు సంఖల్పానికి ప్రతీక అని కొనియాడారు.ఇదే స్పూర్తితో రాబోయే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే ఘన విజయం సాధించి అధికారo లోకి వస్తుంది అని దిమా వ్యక్తం చేసారు తెలంగాణా రాష్టం లో అవినీతి రహిత ప్రజా సంక్షేమ పాలనను అందించాడమే లక్ష్యం అని స్పష్టo చేశారు ఇట్టి కార్యక్రమం లో జగిత్యాల జిల్లా ఉపాధక్షుడు గుగ్గిళ్ళ తుక్కారం గౌడ్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్, చెట్లపెల్లి సాగర్, గిన్నెల శ్రీకాంత్, కాలాల సాయి చందు, పెండం గణేష్,పోతూగంటి శ్రీనివాస్, తులసి కృష్ణ, తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుమల వాసు, నేమురి విజయ్, మ్యాకల గణేష్, ధమ్మా సంతోష్, రాగంశెట్టి సాయి, సిరిమల్ల ధనుంజయ్, గుంటుక నాగరాజు ఎల్లలా నారాయణ ప్రేమ్ సాగర్ మరియు మండల నాయకుల నాయకులు సంకు నరేందర్ బొలిశేట్టి రాజేందర్, చొప్పరి గంగాధర్ కోరుట్ల పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంతోషం లో స్వీట్స్ పంపిన చేసి సంబరాలు జరుపుకున్నారు