navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 1:25 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మంచి నీటి సమస్య పరిష్కారానికి కృషి

19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బొడ్ల ఆనంద్

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణంలోని 19వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికై మున్సిపల్ కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ కృషి చేస్తున్నారు. గతంలో పనిచేయకుండా నిలిచిపోయిన బోర్ మోటార్ స్థానంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతన మోటర్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో వార్డు ప్రజలకు ప్రస్తుతం నీటి సరఫరా సక్రమంగా జరుగుతోందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో నీటి కొరత సమస్య తీవ్రంగా ఉండే అవకాశమున్నందున ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వీధిలో నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే సమస్య పరిష్కారానికి మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, నీటిని వృథా చేయకుండా వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఏదైనా నీటి సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. వార్డు అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ బోడ్ల ఆనంద్, వార్డు సభ్యులు మల్యాల శ్రీనివాస్, సిలివేరి శంకర్, మహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.