మండుతున్న ఎండలు..మనుషులే కాదు, మూగజీవాలూ విలవిల
నవగీతం, భీంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పేరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల వరకు నమోదవుతుండగా, గాల్లో తేమ శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా మనుషులతో పాటు పక్షులు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం రోడ్లపైకి అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మండే ఎండలు, వేడి గాలులతో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు గ్రామాల్లో, పట్టణాల్లో నీటి కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.అయితే ఈ ఎండల...