మత్స్యకారులు ఎన్.ఎఫ్.డీ.పీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

- ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ సూచన నవగీతం,హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమం మరియు వారి హక్కుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను పొందాలంటే ప్రతి మత్స్యకారుడు తప్పనిసరిగా ఎన్.ఎఫ్.డీ.పీ (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫారం) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ నెల 23వ తేదీ చివరి గడువు అని, మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని...