navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 8:22 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

ఎం.జీ.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ పథకం లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో రెండు మరుగుదొడ్ల కు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ సోమరెడ్డి, సిరిపురం రవీందర్,వార్డు సభ్యులు ముష్కరి రమేష్, ఎనుగంటి నరేష్,భుక్యా శేఖర్,మొరపు గంగా రాజం, కాషవత్తుల గంగా రెడ్డి, మహమ్మద్ షబ్బీర్,కదుర్కపు లక్ష్మి,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.