మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లీ గ్రామంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, హక్కులు, సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం, ఆడపిల్లల విద్య ప్రాముఖ్యత, మంచి స్పర్శ – చెడు స్పర్శ అంశాలు, మొబైల్ వినియోగ వ్యసనం, సామాజిక మాధ్యమాల...