మహిళల భద్రత, సాధికారతపై విస్తృత అవగాహన సదస్సు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “99 డేస్ యాక్షన్ ప్లాన్ – ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు (ఈజీఎస్) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత సిబ్బంది మహిళల భద్రత, హక్కులు, సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత ప్రాముఖ్యత, “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమం, ఆడపిల్లల విద్య అవసరం,...