అధికారుల నిర్లక్ష్యంపై ఆలయ గ్రామ ఆలయ అర్చకుడి ఆవేదన
నవగీతం ,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల పట్టణంలో మురికి కాలువ శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని హనుమాన్ దేవాలయం ప్రధాన అర్చకులు దెందుకూరి భాస్కర్ నివాసం ముందు ఉన్న మురికి కాలువ చెత్తతో నిండిపోవడంతో మురుగు నీరు రివర్స్ అయి ఇంటిలోకి ప్రవేశించింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.ఈ సమస్యపై సంబంధిత వార్డు సభ్యులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అర్చకుడు భాస్కర్ స్వయంగా కాలువలోని చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.ఒక ఆలయ పూజారి తానే స్వయంగా మురికి కాలువను శుభ్రం చేయాల్సిన పరిస్థితి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.గ్రామపంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
