మృతుల కుటుంబాలను పరామర్శించిన పునుగొటి కృష్ణారావు
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో అనారోగ్య కారణాలతో మృతిచెందిన రేగుల మల్లవ్వ, కోలాపురం సురేష్ కుటుంబాలను మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పునుగొటి కృష్ణారావు పరామర్శించారు. మృతుల నివాసాలకు వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆవేదనను విన్న ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.అనారోగ్యంతో కుటుంబ పెద్దలను కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్న పునుగొటి కృష్ణారావు, గ్రామ ప్రజలు పార్టీ నాయకులు...