మెట్‌పల్లిలో అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ల ఫిర్యాదు

మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి : మెట్‌పల్లి పట్టణంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ లేఅవుట్లపై పలువురు వార్డు కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను అక్రమంగా లేఅవుట్లుగా మార్చి విక్రయాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.26వ వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్, 16వ వార్డు కౌన్సిలర్ అరిసె వనజ-మురళి,...