మెట్ పల్లి మున్సిపల్ లో ఘనంగా మేడే ఉత్సవాలు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఘనంగా మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి విచ్చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... పట్టణ పరిశుభ్రతలోనూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలోనూ మున్సిపల్ కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎండనక, వాననక కష్టపడే...