నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శ్రమజీవుల పోరాట స్ఫూర్తికి, హక్కులకు ప్రతీక.1886లో చికాగోలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన చారిత్రక పోరాటం, త్యాగాల జ్ఞాపకార్థం ఈ రోజును పాటిస్తారు. కార్మికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ మే 1ను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సోమ రెడ్డి, సిరిపురం రవీందర్,వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, భూక్యా శేఖర్, ఎనుగంటి నరేష్, షబ్బీర్,కదుర్కపు లక్ష్మి, మాట్ల రజిత, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.