మే డే శుభాకాంక్షలు తెలిపిన పాలకవర్గం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ మే 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శ్రమజీవుల పోరాట స్ఫూర్తికి, హక్కులకు ప్రతీక.1886లో చికాగోలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన చారిత్రక పోరాటం, త్యాగాల జ్ఞాపకార్థం ఈ రోజును పాటిస్తారు. కార్మికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ మే 1ను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది అని అన్నారు. ఈ కార్యక్రమం లో...