navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 4:24 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మైనర్ చేత ట్రాక్టర్ డ్రైవింగ్.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామ పరిధిలోని ఎస్‌ఎస్‌ఎల్ బ్రిక్స్‌లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం బాలంగీర్ జిల్లా బంధన్‌పల్లి గ్రామానికి చెందిన జుగేశ్వర్ మాఝి (35), కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నదేమనగా, బాలంగీర్ జిల్లా బరియాలి గ్రామానికి చెందిన ఛబిలా దర్నా (17), ఎస్టీ (ఆదివాసి), గత కొన్ని నెలలుగా నమిలికొండ గ్రామంలోని ఎస్‌ఎస్‌ఎల్ బ్రిక్స్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఇటుకల తయారీ ప్రదేశంలో ఫ్లై యాష్‌ను అన్‌లోడ్ చేయుటకు ఐచర్ ట్రాక్టర్ TS–01–ED–5160 వాహనాన్ని నడిపి తీసుకెళ్తుండగా, పొలాల మధ్య ఉన్న మట్టి ఒడ్లపై అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో ట్రాక్టర్‌పై నుండి పడిపోయినట్లు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లి కొంత దూరంలో బోల్తా పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఛబిలా దర్నాను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి, కరీంనగర్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.అదేవిధంగా, ఎస్‌ఎస్‌ఎల్ బ్రిక్స్ యజమాని నరుకుల్ల శ్రీనివాస్ మైనర్ అయిన ఛబిలా దర్నాకు వాహనం నడిపేందుకు చట్టబద్ధ అర్హత లేదని తెలిసి కూడా ట్రాక్టర్ నడిపేందుకు అనుమతించడం ద్వారా యాజమాన్యపరమైన నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతిస్తే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొడిమ్యాల ఎస్సై సందీప్ సూచించారు.