మైనర్ చేత ట్రాక్టర్ డ్రైవింగ్.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామ పరిధిలోని ఎస్‌ఎస్‌ఎల్ బ్రిక్స్‌లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం బాలంగీర్ జిల్లా బంధన్‌పల్లి గ్రామానికి చెందిన జుగేశ్వర్ మాఝి (35), కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నదేమనగా, బాలంగీర్ జిల్లా బరియాలి గ్రామానికి చెందిన ఛబిలా దర్నా (17), ఎస్టీ (ఆదివాసి), గత కొన్ని నెలలుగా నమిలికొండ గ్రామంలోని ఎస్‌ఎస్‌ఎల్ బ్రిక్స్‌లో పని...