నిందితుడు సాయి భగీరత్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మేడిపల్లి–భీమారం మండల కేంద్రంలో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించి, నిందితుడు బండి సాయి భగీరత్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన సమాజాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిందితుడు ఎక్కడ దాక్కున్నా వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధితురాలు , ఆమె కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు వేగంగా స్పందించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, రాగోజిపేట సర్పంచ్ చెన్నమనేని అజిత్‌రావు, మేడిపల్లి సర్పంచ్ మకిలి దాస్, మాజీ ఎంపీటీసీ పల్లి అర్జున్, మండల నాయకులు చెక్కపల్లి రఘు, ఉదిగిరి ఆదిరెడ్డి, దేశవెని కృష్ణ, చెన్నమనేని రవీందర్‌రావు, లోక జలపతి రెడ్డి, ఎండీ రాజబోస్, పుప్పాల చిన్న భూమయ్య, కైరం కొండ సుధాకర్, ఉరుమట్ల చిన్నరాజం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.