మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై బీఆర్ఎస్ ఆగ్రహం.
నిందితుడు సాయి భగీరత్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మేడిపల్లి–భీమారం మండల కేంద్రంలో వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించి, నిందితుడు బండి సాయి భగీరత్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మైనర్ బాలికపై...