బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ
నవగీతం,మల్యాల ప్రతినిధి:
రాష్ట్రంలో దాదాపు రూ.7,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల ప్రారంభోత్సవానికి తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మే 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేలా బూత్ స్థాయి నుంచే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో మల్యాల మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకులు హాజరైన ఈ సమావేశంలో ఆయన కీలక విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ లేక, డీఏలు రాక, ఉద్యోగార్థులకు నోటిఫికేషన్లు లేక, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక, రిటైర్మెంట్ ఉద్యోగులకు వారు దాచుకున్న డబ్బులు వాళ్లకు ఇవ్వక.. కాంగ్రెస్ సర్కారు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నది. తెలంగాణలో పారదర్శక పాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది బీజేపీతోనే సాధ్యం. ప్రజలు ఒకసారి ఆశీర్వదిస్తే, అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. తెలంగాణ భవిష్యత్ తరాల అభ్యున్నతికి బిజెపి అధికారంలోకి రావడం అత్యవసరం. మోదీ గారు దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడం మనందరి బాధ్యత. ఈ సభను విజయవంతం చేద్దాం”అని జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మి నారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుగాజుల మల్లేశం. మహిళ మోర్చా అధ్యక్షురాలు కటకం లత. బీజవయ్య మండల అధ్యక్షుడు పొన్నగంటి గౌతం. ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మన పరమేష్. ప్రధాన కార్యదర్శులు పొన్నం సాయికుమార్ .పిల్లి రాజశేఖర్. మొద్దుట్ల సర్పంచ్ సంకుర్తి తిరుపతి. మండల ఉపాధ్యక్షులు గుగ్గిల గంగరాజు .కోన శ్రీనివాస్. కార్యదర్శి కట్ట జ్యోతి. ఎంపీటీసీ మాజీ రాచర్ల రమేష్. నీలం రవి. జనగాం రాములు. జవాజి రాజ్ కుమార్. దాసరి విజయ్ కుమార్. దూస రమేష్. మహేష్. శేఖర్. జిల్లాల రమేష్. సంఘ శంకర్. రాఘవేంద్ర. గడ్డ మల్లేశం. మిరుదొడ్డి హరీష్. సందీప్. గంగాధర్. పరశురాం. వీరబత్తిని మోహన్. భరత్. గమ్మిశెట్టి రాజేశం. బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు