యామాపూర్‌లో నిరుపేద కుటుంబానికి అండగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్..

నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గుడిసె ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న సామగ్రి మొత్తం దగ్ధమై కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ ఘటనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు, పిల్లలకు బట్టలు అందజేశారు. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం...