రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జువ్వాడి కృష్ణారావు

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి(వి.సంపత్) భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆధునిక అభ్యుదయ పథంలో నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.దేశంలో టెలికాం, సమాచార సాంకేతిక (ఐటీ) రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు, అధికార వికేంద్రీకరణే ధ్యేయంగా పంచాయతీరాజ్ వ్యవస్థను...