navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 11:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి:

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండల కేంద్రం,పూడూరు, అప్పారావుపేట, మల్యాల మండలంలోని మల్యాల మండల కేంద్రం, ముత్యంపేట , గ్రామాలలో. ఐ కె పి ,పాక్స్ ,ఏఏంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రాలలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సూచించారు. కేంద్రాలలో హమలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని ఆదేశించారు.అలాగే ట్రక్ షీట్ నమోదు, ట్యాబ్ ఎంట్రీలు వంటి అన్ని డాక్యుమెంటేషన్ పనులను సమయానికి పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో పారదర్శకత పాటించడంతో పాటు రైతులకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డి సీఎస్ ఓ జితేందర్ రెడ్డి, తహసీల్దార్ లు, సివిల్ సప్లై అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కేంద్రల నిర్వాహకులు మరియు తదితరులు పాల్గొన్నారు.