రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – రైతులకు సాగు సూచనలు

జీలుగ, జనుము సాగుపై రైతులు దృష్టి సారించాలని నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత పలు సూచనలు చేశారు.యూరియా వంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, నేల సారాన్ని పెంచే...