navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:14 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతు సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తా: మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా చైర్మన్ కూన గోవర్ధన్ మాట్లాడుతూ .. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారంలో కార్యక్రమంలో రైతు సమస్యల పరిష్కారానికి అన్ని విధాల మా తరఫున సహకారం ఉంటుందని మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన ప్రతి గింజ కొనుగోలు జరుగుతుందని రైతులు నిరాశ పడవద్దు అని ప్రతి ఒక్క రైతు తేమ లేకుండా ఇంటి వద్ద అయిన తర్వాత తీసుకొచ్చి తొందరగా కొనుగోలు చేసుకుని పోవాలని కానీ తేమ కానీ ధాన్యం తీసుకువచ్చి ఇక్కడ రోజుల తరబడి వేచి చూడవద్దని ఇది రైతులు ప్రతి ఒక్క రైతు గమనించాలని మార్కెట్ కు వచ్చిన రైతుకు ఏ సమస్య ఉన్న మా వద్దకు రావాలని సమస్య పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ డైరెక్టర్స్ పుల్లూరి నవీన్ , సంగు గంగాధర్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి హరికృష్ణ సతీష్ నిమ్మల భూమారెడ్డి పుప్పాల చిన్న అంజయ్య రైతులు, వ్యాపారస్థులు, హమాలీ, చాట కార్మికులు మరియు సిబ్బంది పాల్గొన్నారు