రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన విప్
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన విప్
నవగీతం,రాజన్న సిరిసిల్ల:
వేములవాడ పట్టణ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలంలో పర్యటన ముగించుకుని పట్టణానికి తిరిగి వస్తున్న సమయంలో చెక్కపల్లి రోడ్డులోని పెద్దమ్మ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వేములవాడ పట్టణం భగవంతరావు నగర్‌కు చెందిన ఊరడి భూమయ్య తన వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడిని పరామర్శించారు.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని ఆలస్యం చేయకుండా తన సొంత వాహనంలోనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.అంతేకాకుండా, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచిస్తూ అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో విప్ ఆది శ్రీనివాస్ చూపిన మానవత్వం, చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
