వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి– జనగణన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపు ప్రక్రియతో పాటు జనగణన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువకాలం నిల్వ లేకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సమస్యలు తలెత్తితే...