navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 11:05 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యతోనే ఉన్నత భవిష్యత్తు :వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ

ఎనిమిదో వార్డులో మెరిసిన ఆణిముత్యాలు

నవగీతం,వైరా ప్రతినిధి:

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో మెరిసిన ఆణిముత్యాలు అని పదో తరగతిలో 500 పైగా మార్పులు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ, వైరా ఎస్సై పుష్పాల రామారావు పేర్కొన్నారు. శుక్రవారం బ్రాహ్మణపల్లి అగ్రహారం ఎనిమిదో వార్డులో ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే నేపథ్యంలో 8వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్య అధ్యక్షతన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైరా ఎస్సై పుష్పాల రామారావు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎనిమిదో వార్డ్ లోని ఉదారపు రిత్విక బాలమర్తి జెస్సిక, నల్లగట్ల కమల్ బేతపూడి సుగన్ హంస,కోలా అఖిల్, షేక్ రహీం,మోదుగు కిషోర్ కుమార్ మోదుగు రేఖ,యాండ్రాతి వెంకటేశ్వర్లు ధను శ్రీ, తో పాటు పలువురిని అభినందిస్తూ ఘనంగా శాలువాలతో సన్మానించారు.. సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతూనే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎట్టి పరిస్థితుల్లో చదువును నిర్లక్ష్యం చేయొద్దన్నారు.సమాజంలో చదువుతూనే గౌరవం పొందవచ్చు అన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్యను వారు ప్రత్యేకంగా అభినందించారు అనంతరం కౌన్సిలర్ చిలకా చిన్న కోటయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షతో చదివిస్తున్నారని వారి ఆకాంక్షకు అనుగుణంగా ఉత్తమ ప్రతిభతో ఉన్నత ఫలితాలతో కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.