విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఆధునిక విద్యాసంస్థలు నిర్మిస్తాం
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని చలిగల్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, డైరెక్టర్ జనరల్ వాలంటరీ అనితతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చలిగల్‌లో నిర్మించనున్న పాఠశాలల కోసం అవసరమైన మౌలిక వసతులు, భవన నిర్మాణం, రహదారి...