విద్య వారోత్సవ వేడుకలను విజయవంతం చేయండి : ప్రిన్సిపాల్ పిలుపు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక - 99" రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుంచి విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్య వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఆదివారం రోజున బోధన, బోధనేతర సిబ్బంది సమక్షంలో విద్య వారోత్సవ వేడుకల...